Thursday, December 26, 2024

మహేష్ బాబు ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పిన నిర్మాత…

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా పలు కొత్త పోస్టర్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నెల 6న హైదరాబాద్ యూసుఫ్ గూడలో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా.

అయితే, నిర్మాతలకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యూసుఫ్ గూడ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈవెంట్ కు బందోబస్తు కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో నిర్మాత నాగవంశీ లేఖ విడుదల చేస్తూ అభిమానులకు క్షమాపణ చెప్పారు. సెక్యూరిటీ సమస్య కారణంగా ఈ ఫంక్షన్ ను వాయిదా వేస్తున్నామని.. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News