Friday, December 27, 2024

గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది.ఆదివారం రాత్రి మేకర్స్ రిలీజ్ చేసని ఈ ట్రైలర్ యూట్యూబ్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ అదరగొడుతోంది. దీంతో పండక్కి బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా అదరిపోయింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, వెన్నెల కిషోర్, అజయ్ గోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News