Friday, December 27, 2024

రికార్డు సృష్టించిన గుంటూరు కారం ట్రైలర్.. ఇక పండక్కి ఊచకోతే!

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో ఈ మూవీ ట్రైలర్ ఏకంగా 39మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో రచ్చ చేస్తూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీంతో సౌత్ ఇండియాలోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా గుంటూరు కారం నిలిచింది. దీంతో మహేష్ బాబు అంటే అట్లుంటది అంటూ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ట్రైలర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే.. ఇక, థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ మహేష్ బాబు ఊచకోతకోస్తాడని..సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్. కాగా, ఈ మూవీ సంక్రాంతి కానుకగా.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News