Monday, December 23, 2024

‘గుంటూరు కారం’ టికెట్ పెంపుకు, బెనిఫిట్ షోలకూ ఓకే

- Advertisement -
- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు  హీరోగా సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం మూవీకి తెలంగాణలో అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మూవీకి టికెట్ రేట్ల పెంపునకూ, బెనిఫిట్ షోలకూ తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పేసింది.

హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక జనవరి 6న జరగాల్సి ఉండగా, దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో బెనిఫిట్ షోలకైనా ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదోనని మూవీ నిర్మాతలు సందేహంలో పడ్డారు. తాజాగా ఈ మూవీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు నిర్వహించుకునేందుకు ఓకే చెబుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

మూవీ రిలీజైన మొదటివారం మల్టీప్లెక్సులలో రూ. 100 చొప్పున, సింగిల్ స్క్రీన్లపై రూ. 65 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే మొదటి వారం ఈ మూవీ రిలీజైన అన్ని థియేటర్లలోనూ ఉదయం 4గంటలకు ఒక షో వేసుకోవచ్చును.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News