Wednesday, January 22, 2025

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

అమరావతి: కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో మున్సిపల్ కమిషనర్‌కు ఎపి హైకోర్టు నెల రోజులు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కీర్తి చేకూరి పని చేస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని లీజు చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్‌లకు రూ.25 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ కీర్త అమలు చేయలేదు. దీంతో పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది. జనవరి 2న రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆమెకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News