- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి ఆడబిడ్డకు ఫార్మసీ విద్యార్థిని జన్మనిచ్చింది. తోటి ఫార్మసీ విద్యార్థిని సహకారంతో హాస్టల్‌లోనే 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని పండంటి బిడ్డను ప్రసవించింది. అధిక రక్తస్రావం కావడంతో యువతిని అధికారులు జిజిహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనలో గుంటూరు సంక్షేమ శాఖ అధికారిణి జయప్రదను కలెక్టర్ నాగలక్ష్మి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు కమిటీని ఉన్నతాధికారులు నియమించారు. విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9 నెలలు గర్భంతో ఉన్న యువతిని హాస్టల్ సిబ్బంది కనిపెట్టలేకపోయారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
- Advertisement -