Monday, January 20, 2025

యువతిపై బాబాయ్ అత్యాచారం… గర్భవతి కావడంతో…

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాలికాలంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దెబ్బతింటున్నాయి. వావివరసలు తెలియకుండా మనుషులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వరసకు కూతురు.. ఆమెపై బాబాయ్ అత్యాచారం చేయడంతో గర్భవతి అయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తాడేపల్లి మండలంలోని ఓ గ్రామంలో యువతి తన ఇంటి దగ్గర ఉంటుంది. వరసకు కూతురు అయ్యే యువతిపై బాబాయ్ అత్యాచారం చేశాడు. దీంతో గర్భ ధరించడంతో ఆమె తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉన్నతాధికారులు తెలియజేసిన తరువాత కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Also Read: ఎంత పని చేశావ్ టమాటా… కూర వండిన భర్త… భార్య కనిపించడం లేదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News