Wednesday, January 22, 2025

గుర్బాజ్… హ్యాట్సాఫ్ టు యూ!

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్గన్ జట్టు చివరివరకూ పోరాడి పరాజయం పాలై, సెమీస్ కు చేరకుండానే వైదొలగింది. ప్రపంచ కప్ టోర్నమెంటులో ఆఫ్గనిస్తాన్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ, ఆ జట్టు ఆడిన తీరు, చూపిన పోరాట పటిమ ఎందరినో ఆకట్టుకుంది. తొమ్మిది మ్యాచ్ లు ఆడి, నాలుగింటిలో గెలిచిన ఆ జట్టు ఆటగాళ్లు ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టారు. తాజాగా, ఆ జట్టు ఆటగాళ్ల  ఔదార్యాన్ని తెలిపే ఓ వీడియో బయటపడింది. దీనిని చూసినవారంతా ఆ జట్టు స్టార్ బ్యాట్స్ మన్ గుర్బాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆఫ్గన్ బ్యాట్స్ మన్ రహ్మనుల్లా గుర్బాజ్ అహ్మదాబాద్ లో అర్థరాత్రి వేళ వీధుల్లో తిరుగుతూ, రోడ్డు పక్కన నిద్రిస్తున్న నిరుపేదలకు సాయం చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు ట్విటర్ లో వైరల్ అవుతోంది. పేదల పట్ల అతనికి గల ఉదారతాగుణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.  అర్ధరాత్రివేళ కారులో బయల్దేరిన గుర్బాజ్, అనేక ప్రదేశాల్లో రోడ్డు పక్కన పడుకున్నవారికి నిద్రాభంగం కలిగించకుండా, వారి చెంతన కొన్ని కరెన్సీ నోట్లు పెడుతూ ముందుకు సాగిపోయాడు. ఇటీవల ఆఫ్గనిస్తాన్ లో జరిగిన భూకంపంలో మృతులు, బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు గుర్బాజ్ బృందం ఎంతో శ్రమించి విరాళాలు సేకరించింది. తాజా బయటపడటంతో అందరూ గుర్బాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ ఈ వీడియోను అప్ లోడ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News