Friday, December 20, 2024

రంజిత్ హత్య కేసులో డే రా చీఫ్ గుర్మీత్ నిర్దోషి

- Advertisement -
- Advertisement -

పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు

చండీగఢ్ : రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ దాఖలు చేసిన అప్పీల్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం అనుమతించింది. ఈ కేసులో తనను దోషిగా నిర్ధారించడాన్ని సవాల్ చేస్తూ గుర్మీత్ రామ్ రహీమ్ దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ న్యాయమూర్తులు సురేశ్వర్ ఠాకూర్, లలిత్ బాత్రాతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వు జారీ చేసింది. వివరణత్మాక ఉత్తర్వు రావలసి ఉంది.

2002లో డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకు రామ్ రహీమ్‌ను, మరి నలుగురిని దోషులుగా నిర్ధారించిన తరువాత పంచ్‌కులలోని ప్రత్యేక సిబిఐ కోర్టు 2021 అక్టోబర్‌లో వారికి జీవిత ఖైదు విధించిన పిమ్మట డేరా చీఫ్ సిబిఐపైన, ఇతర ప్రతివాదులపైన హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ కోర్టు డేరా చీఫ్‌కు రూ. 31 లక్షల జరిమానా కూడా విధించింది. రంజిత్ సింగ్‌ను కురుక్షేత్రలోని అతని స్వస్థలం ఖాన్‌పూర్ కొలియన్ గ్రామంలో 2002 జూలై 10న నలుగురు దుండగులు కాల్చి చంపారు. 2021 డిసెంబర్‌లో రామ్ రహీమ్ అప్పీల్‌ను విచారణకు హైకోర్టు స్వీకరిస్తూ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న కాలంలో 50 శాతం జరిమానా వసూలుపై స్టే మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News