Friday, November 22, 2024

19 ఏండ్ల నాటి హత్యకేసు డేరాబాబా.. బృందానికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -
Gurmeet Ram Rahim get life imprisonment
రేప్ కేసులలో ఇప్పటికే జైలులో గుర్మీత్
20 ఏండ్ల ఖైదు శిక్షదశలోనే ఈ తీర్పు

చండీగఢ్ : డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్, మరో నలుగురికి హత్యకేసులో జీవిత ఖైదు విధించారు. డేరా విశ్వాసానికి చెందిన వ్యవహారాల మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకేసు 19 ఏండ్ల కిందట జరిగింది. దీనికి సంబంధించి పంచ్‌కుల న్యాయస్థానం వీరిని ఈ నెల 8న దోషులుగా నిర్థారించింది. సోమవారం శిక్షలు వెలువరించింది. గుర్మీత్‌తో పాటు కృషన్‌లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్‌లకు యావజ్జీవ శిక్షలు పడ్డాయని సిబిఐ ప్రత్యేక విచారణాధికారి హెచ్‌పిఎస్ వర్మ తెలిపారు. డేరా తెగ నమ్మకస్తుడు అయిన మేనేజర్ రంజిత్ సింగ్‌ను హర్యానాలోని కురుక్షేత్రలోని ఖాన్పూర్ గ్రామంలో 2002 జులై 10వ తేదీన కాల్పులు జరిపి చంపారు. డేరా ప్రధాన కార్యాలయంలో అక్రమాలు, ప్రత్యేకించి అక్కడ మహిళలను లైంగికంగా వాడుకుంటూ డేరా పెద్దలు తమ అవసరాలను తీర్చుకుంటున్న వైనంపై అప్పట్లో వెలువడ్డ అజ్ఞాత ఆకాశరామన్న లేఖ సంచలనం కల్గించింది.

ఈ లేఖ వెనుక రంజిత్ సింగ్ పాత్ర ఉందనే అనుమానంతో డేరా అధినేత ఇతరులతో కలిసి ఆయనను చంపించినట్లు సుదీర్ఘ దర్యాప్తు క్రమంలో సిబిఐ నిర్థారించింది. ఈ క్రమంలో శిక్ష పడింది. తనను రంజిత్ అంతమొందించేందుకు ఇతరులతో కలిసి కుట్ర పన్నుతున్నాడనే ఉప్పందడంతోనే డేరా చీఫ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఇక తన వద్దకు వచ్చిన ఇద్దరు శిష్యురాళ్లపై లైంగికంగా అత్యాచారానికి పాల్పడినట్లు వెలువడ్డ అభియోగాలకు సంబంధించి 2017లో గుర్మీత్ 20 సంవత్సరాల జైలు శిక్షకు గురై ఇప్పుడు రొహతక్‌లోని సునారియా జైలులో ఖైదీగా ఉన్నాడు. ఇప్పటికేసులో డేరాబాబాకు జీవితఖైదుతో పాటు రూ 30 లక్షల జరిమానా కూడా విధించారు. ఇతరులకు రూ 50 వేల చొప్పున జరిమానాకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News