Sunday, April 6, 2025

డేరా సింగ్ బాబాకు 50 రోజుల పెరోల్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్:అత్యాచారం కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 50 రోజుల పెరోల్ లభించినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. గత ఏడాది నవంబర్ 21న 21 రోజుల పెరోల్‌పై హర్యానాలోని రోహతక్ జిల్లా సునరియా జైలు నుంచి విడుదలైన గుర్మీత్ పెరోల్‌పై విడుదల కావడం ఇది ఐదవసారి. మహిళా శిష్యులు ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువుకావడంతో డేరా సింగ్ బాబా 20 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు. 2022 అక్టోబర్‌లో కూడా అతనికి 40 రోజుల పెరోల్ లభించింది. 2022 జూన్‌లో నెలరోజులపాటు పెరోల్‌పై అతను విడుదలయ్యాడు. అంతకుముందు ఫిబ్రవరి 7న మూడువారాలపాటు పెరోల్ లభించింది. తన తాత్కాలిక విడుదల కాలంలో అతను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఉన్న ఆశ్రమంలో గడుపుతుంటాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News