- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నూతన గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) గుర్మీత్ సింగ్ బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇక్కడి రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో గుర్మీత్ సింగ్ చేత ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహన్ ప్రమాణం చేయించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమి, ఆయన మంత్రివర్గ సహచరులు సత్పాల్ మహారజ్, ధన్ సింగ్ రావత్, అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌చంద్ అగర్వాల్, డిజిపి అశోక్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ సంధు తదితరులు హాజరయ్యారు. తన పదవీకాలం ముగియడానికి రెండేళ్లకు ముందే బేబి రాణి మౌర్య రాజీనామా చేయడంతో కొత్త గవర్నర్‌గా గుర్మీత్ సింగ్ నియమితులయ్యారు.
- Advertisement -