Monday, December 23, 2024

కిసాన్ సర్కార్ ఈసారి పక్కా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశంలో వచ్చే ఎన్నికల్లో ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ వచ్చి తీరుతుందన్న విశ్వాసాన్ని బిఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గు ర్నామ్‌సింగ్ చడూని వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత రాష్ట్ర ప్ర భుత్వం ఇవ్వడం లేదన్నారు. అందుకే దేశవ్యాప్యంగా ఉన్న రైతులంతా బిఆర్‌ఎస్ సర్కార్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారన్నా రు. కెసిఆర్ నేతృత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారన్నారు. ఆ శుభ గడియలు త్వరలోనే రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గుర్నామ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో భారీ మార్పు రావాల్సి ఉందన్నారు. అది బిఆర్‌ఎస్‌తో సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశ వ్యాప్తం కావాల్సి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కెసిఆర్‌కు ఉన్నంత అంకిత భావం ఉండాలన్నారు. కానీ దురదృష్టవశాత్తు అనేక రాష్ట్రాల్లో రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేకపోతున్నాయని గుర్నామ్‌సింగ్ విమర్శించారు.తెలంగాణ ప్రభుత్వ ఖజానాపై తీవ్ర స్థాయిలో ఆర్ధిక భారం పడుతున్నప్పటికీ సిఎం కెసిఆర్ మాత్రం రైతు బంధు, రైతు బీమా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరముందన్నారు. మొదటి దశలో 6 రాష్ట్రాల్లో కిసాన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇందులో రైతులంతా భాగస్వామ్యం కావాలన్నారు. పంజాబ్ తో పాటు కొన్ని రాష్ట్రాల్లో రైతులతో సమావేశాలను ఇప్పటికే నిర్వహించామన్నారు. అందరూ బిఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారని గుర్నామ్‌సింగ్ పేర్కొన్నారు.

అబ్ కి బార్ కిసాన్ సర్కార్ కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గుజరాత్ మోడల్ తో దేశానికి ఎం వచ్చిందని గుర్నామ్‌సింగ్ ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ పేరుతో ప్రజల జేబులో డబ్బులు గుంజారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు చేస్తామన్నారు. తెలంగాణలో పర్యటన తర్వాతే బిఆర్‌ఎస్‌లో తాను చేరానన్నారు. తెలంగాణలో తప్ప ప్రతి అరగంటకు దేశంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News