- Advertisement -
అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్ ట్రంప్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గుర్పత్వంత్ సింగ్ పన్నూ పాల్గొన్న విషయంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికాతో భారత్ లేవనెత్తుతూనే ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడు, భారత జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికా ప్రభుత్వంతో ప్రస్తావిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు. జనవరి 20న వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చిన ట్రంప్ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పన్నూ ది లిబర్టీ బాల్‌లో కనిపించాడు. ఈ కార్యక్రమానికి ఖలిస్తానీ ఉగ్రవాదిని ఆహ్వానించలేదు. తనకు పరిచయస్తుల ద్వారా టికెట్లు కొనుగోలు చేశాడని వెల్లడైంది.
- Advertisement -