ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్
న్యూఢిల్లీ : ఖలిస్థాన్‌కు మద్దతుగా ప్రపంచ దేశాల్లో రెఫరెండం నిర్వహిస్తున్నందుకు తనను భారత ప్రభుత్వం హత్య చేయాలనుకుంటోందని, ఈ పరిస్థితుల్లో తనను రక్షించవలసిన బాధ్యత అమెరికా ప్రభుత్వానిదేనని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పేర్కొన్నారు. అమెరికా సార్వభౌమత్వానికి, ఇది సవాల్‌గా పన్నూ వ్యాఖ్యానించారు. ఇది అమెరికా లోని వాక్‌స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొన్నారు.
దీనిపై అమెరికా అధికార వర్గాలు మాట్లాడాలని కోరుకుంటున్నానని పన్నూ టైమ్ ఇంటర్వూలో తెలిపారు వ్యవస్థీకృత నేరస్థులు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలపై అమెరికా తన సమాచారాన్ని పంచుకుంటున్నట్టు గత వారం భారత్ వెల్లడించింది. అమెరికా లోనే పన్నూను హత్య చేయడానికి అమెరికా ప్రభుత్వ వర్గాలు కుట్ర పన్నుతున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్‌లో కథనం వెలువడింది. కుట్ర విషయాన్ని బైడెన్ ప్రభుత్వం భారత్‌తో పంచుకుంది. బాధ్యులు బాధ్యత వహించాలని చెప్పింది. ఈ సమాచారాన్ని భారత్‌కు తెలియజేసినప్పుడు ఆందోళన చెందిందని, ఇది తమ ప్రభుత్వ విధానం కాదని , దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు భారత్ తెలియజేసిందని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.