Monday, January 20, 2025

’గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ’గుర్తుందా శీతాకాలం’. సక్సెస్‌ఫుల్ కన్నడ దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం వేదాక్షర ఫిల్మ్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రూపొందింది. చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ “ఎక్కడికి వెళ్లిన ఈ టైటిల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు.

ఈ క్రెడిట్ అంతా హీరో సత్యదేవ్‌దే”అని అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఈ సినిమా ఫోర్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. అన్ని సెక్షన్స్‌కి కనెక్ట్ అయ్యే ఒక సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమాలో తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి అద్భుతంగా నటించారు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News