Wednesday, January 22, 2025

‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

Gurtunda Seetakalam Trailer to release on Feb 14

హైదరాబాద్: యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంటగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను రేపు వాలైంటెన్స్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. క‌న్న‌డ‌ సూప‌ర్ హిట్ ‘ల‌వ్ మాక్‌టైల్’ మూవీ రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. కాగా, త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Gurtunda Seetakalam Trailer to release on Feb 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News