Monday, December 23, 2024

నా లైఫ్‌లో శీతాకాలంకు ఇంకో పేరుంది.. ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

Gurtunda Seetakalam Trailer to released

హైదరాబాద్: యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంటగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ” ‘శీతాకాలం.. మంచులో మ‌నుషులు త‌డిసి ముద్ద‌య్యే కాలం. చ‌ల్ల‌గాలికి పిల్ల‌గాలి తోడయ్యే వెచ్చ‌ని కాలం. నా లైఫ్‌లో శీతాకాలంకు ఇంకో పేరుంది. సీజ‌న్ ఆఫ్ మ్యాజిక్’. ‘మ‌న‌సులో ప్రేమించాలంటే ముందు క‌ళ్ళ‌తో చూడాలి కదా. అలా నా క‌ళ్ళ‌కు ఏ అమ్మాయి న‌చ్చినా వెంట‌నే త‌నే నా లైఫ్ పార్ట్న‌ర్ అనిపిస్తుంది. స్కూల్ డేస్‌లో కోమ‌లి.. కాలేజ్ డేస్‌లో అమ్ము.. జ‌ర్నీలో దివ్య‌.. ఫైన‌ల్‌గా నిధి. వీళ్ల‌లో నా లైఫ్ పార్ట్న‌ర్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు స‌మాదానం గురించి ఆలోచిస్తుంటే గాలిలో మెల్ల‌గా చ‌ల్ల‌గా వినిపిస్తుంది గుర్తుందా శీతాకాలం. ఇలా శీతాకాలం వ‌చ్చిన ప్ర‌తిసారి కొత్త కొత్త అందాల‌ను మోసుకొచ్చి నా ఊపిరాడ‌కుండా చేసింది’ ”అంటూ  స‌త్య‌దేవ్ త‌న ప్రేమ క‌థలు చెప్ప‌డం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌న్న‌డ‌ సూప‌ర్ హిట్ ‘ల‌వ్ మాక్‌టైల్’ మూవీ రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. కాగా, త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Gurtunda Seetakalam Trailer to released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News