Sunday, January 19, 2025

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

- Advertisement -
- Advertisement -
  • ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్‌నగర్: గురు పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారు జాము నుండే సాయిబాబా దేవాలయానికి భక్తులు పొటేత్తారు.

పూలతో బాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి లాపేక్ష, ఏది ఆశించకుండా గురువు తన శిష్యుడికి విద్యను నేర్పిస్తారు. దాంతో శిష్యుడు తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తాడు. ఇదీ గురు శిష్యుల సంబంధం, ఏ రకమైన పేగుబంధం లేని పరమాత్మ సంబంధమని పేర్కొన్నారు. గురువులను ప్రతి విద్యార్థిని గౌరవించుకునేందుకు కృషి చేయాలని, అప్పుడే సంస్కారవంతమైన విద్య లభిస్తుందని వివరించారు. విద్యార్థులు గురువు బాటలో నడిస్తే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు వీలుంటుందని తెలిపారు.

గురువు నుండి శిక్షణ పొందిన విద్యార్ధులు ఎప్పటికి మరచిపోరాదని, అలా చేస్తే దానికి ఉన్న బంధం పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పివైస్ చైర్మెన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మెన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మెన్ ఎంఎస్ నటరాజన్, కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్, శివ, ఆలయ కమిటీ నిర్వాహకులు డాక్టర్ విజయ్‌కుమార్, కమ్మదనం సుధాకర్, డాక్టర్ మల్లప్పలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News