Monday, December 23, 2024

నగ్నంగా చేసి… కుక్కలతో కరిపించి…. 13 ఏళ్ల బాలికపై అమానుషం

- Advertisement -
- Advertisement -

పదమూడేళ్ల బాలికపై ఓ కుటుంబం అమానుషంగా ప్రవర్తించింది. తమ ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఆ బాలికను నెలల తరబడి దారుణమైన వేధింపులకు గురి చేసింది.

బీహార్ కు చెందిన ఓ తల్లి తన 13 ఏళ్ల కూతురితో సహా జీవనోపాధి వెతుక్కుంటూ గురుగ్రామ్ చేరింది. సెక్టార్ 57లో వాహనాలు శుభ్రం చేసే ఓ వ్యక్తి చెప్పడంతో, జూన్ 27న శశి శర్మ అనే వ్యక్తి ఇంట్లో తన కూతురిని నెలకు 9వేల రూపాయల జీతానికి పనిలో పెట్టింది. మొదటి రెండు నెలలు మాత్రమే సరిగ్గా జీతమిచ్చిన యజమాని శశి శర్మ, ఆ తర్వాతనుంచి బాలికకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. అతని ఇద్దరు కొడుకులు కూడా ఆ చిన్నారిపై అకృత్యాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్ తోను, సుత్తితోనూ ఆమెను కొట్టేవారనీ, నోటికి టేపు అతికించి, ఒక గదిలో బంధించి, రెండురోజులకు ఒకసారి అన్నం పెట్టేవారని చెప్పారు. యజమాని కొడుకులు బాలికను నగ్నంగా చేసి, ఆమెను తాకరాని చోటా తాకేవారనీ, తమ పెంపుడు కుక్కలతో కరిపించేవారనీ, చేతులపై యాసిడ్ పోసి హింసించేవారని పోలీసులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాలిక భయపడి, వారి చిత్రహింసలను మౌనంగా భరిస్తూ వచ్చింది. కూతురి కోసం శశి శర్మ ఇంటికి వచ్చిన తల్లి ఈ అమానుషకాండను చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శశి శర్మ, అతని ఇద్దరు కొడుకులపైనా పోక్సోతోపాటు ఇతర చట్టాల కింద కేసులు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News