Monday, December 23, 2024

ఎగ్ కర్రీ కోసం ప్రియురాలి ప్రాణంతీసిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రియురాలు ఎగ్ కర్రీ వండిపెట్టలేదని ఆమెను సుత్తితో ప్రియుడు కొట్టి చంపిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్ రాష్ట్రం మదేపూర్ జిల్లా అరహి గ్రామానికి చెందిన లలన్ యాదవ్ ఢిల్లీలో భవన కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం పాముకాటుతో భార్య చనిపోవడంతో అతడు ఒంటరి జీవనం సాగిస్తున్నాడు. చెత్త ఏరుకునే అంజలి(32) అనే మహిళతో పరిచయం ఏర్పడడంతో సహజీవనానికి దారితీసింది. గురుగ్రామ్‌లోని చౌమా గ్రామంలో అంజలి తన భార్య అని గుర్తింపు కార్డులు చూపించి యాదవ్ ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. శనివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చి అంజలిని ఎగ్ కర్రీ చేయమని అడిగాడు. ఆమె ఎగ్ కర్రీ చేయనని సమాధానం చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో సుత్తె తీసుకొని ఆమె తలపై బాదడంతో చనిపోయింది. అక్కడి నుంచి ప్రియుడు పారిపోయాడు. ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఢిల్లీలోని సరయ్ కలఖాన్ ప్రాంతంలో యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News