Friday, December 20, 2024

Lover: ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియురాలు కిరోసిన్ పోసుకొని

- Advertisement -
- Advertisement -

 

గురుగ్రామ్: తన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మహిళ తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుని చనిపోయిన సంఘటన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిహార్‌కు చెందిన మంజు అనే మహిళ (30) గురుగ్రామ్‌లోని సెక్టార్ 37 ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తుంది. కంపెనీలో పని చేసే ఓ బాబులాల్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆదివారం సాయంత్రం అతడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాబులాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ ఘటనపై సెక్టార్ 37 పోలీస్ అధికారి సునీతా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News