హరియాణా: కరోనా భయంతో ఓ భార్య తన భర్తను ఇంట్లోకి రానివ్వకపోవడంతో కొన్నాళ్లుగా బంధువులు, స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటున్నాడు. ఈ సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. తల్లి, కుమారుడు గత మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. కోవిడ్ ఆంక్షలు సడలించినా భర్తను మహిళ ఇంట్లోకి రానివ్వడం లేదని సమాచారం. భార్య వైఖరిలో మార్చు రాకపోవడంతో విసిగిపోయిన భర్త పోలీసులను ఆశ్రయించాడు.
2020లో మొదటి లాక్‌డౌన్ తర్వాత ఆంక్షలు సడలించినప్పుడు ఆఫీస్‌కి వెళ్లేందుకు బయటకు వచ్చిన తనను ఇంట్లోకి రానివ్వడం లేదని బాధితులు పోలీసులు దగ్గర వాపోయాడు. భర్త ఫిర్యాదుతో ఇంటి తలుపులు పగులగొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. అప్పటికి వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు తల్లి, కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. ఫిబ్రవరి 17న ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న మున్మున్ భర్త సుజన్ మాఝీ చక్కర్‌పూర్ పోలీస్ పోస్ట్‌లో ఉన్న అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.