Sunday, December 22, 2024

గురుకుల డిగ్రీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Gurukul Degree Joint Entrance Exam Results released

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎస్‌సి,ఎస్‌టి గురుకుల డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకై నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎస్‌సి మహిళ డిగ్రీ కాలేజీలు 30, ఎస్‌టి మహిళా డిగ్రీ కాలేజీలు 15, ఎస్‌టి బాలుర డిగ్రీ కాలేజీలు 7, మొత్తం 52 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. -వీటిలో ప్రవేశాల కోసం ఇటీవల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. -ఈ ప్రవేశ పరీక్షకు 18,498 మంది అమ్మాయిలు హాజరు కాగా,14,201 మంది (85% ), 2,495 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో విద్యార్థిని అర్చన మొదటి ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా అర్చనతో పాటు ఉత్తీర్ణత సాధించిన వారందరిని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటి కార్యదర్శి రోనాల్ రాస్ అభినందించారు. ఎస్‌సి గురుకులాలకు సంబంధించిన ఫలితాలు, www.tswreis.ac.inలో, ఎస్‌టి గురుకులాలకు సంబంధించిన ఫలితాలను https://tgtwgurukulam.Telangana.gov.in వెబ్ సైట్స్ ద్వారా పొందవచ్చని అధికారులు హన్మంత్‌నాయక్, ఎం.ప్రవీణ్, ప్రమోద్ కుమార్, శర్మలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News