Wednesday, January 22, 2025

రైలు పట్టాలపై పడి గురుకుల విద్యార్థిని ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

కమ్మదనం పాఠశాల విద్యార్థినిగా గుర్తింపు..
అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామంలో విషాద ఛాయలు…

మన తెలంగాణ / అచ్చంపేట : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రైలు పట్టాలపై  పదహారేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేసుకుని అక్కడ దొరికిన ఆధారాలతో గాయత్రిగా గుర్తించారు. రైల్వే పోలీసుల, స్థానికుల వివరాల మేరకు… కమ్మదనం గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న దళిత బాలిక గాయత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన చిన్న కిష్టయ్య సర్వస్వతి దంపతుల రెండవ సంతానంగా గుర్తించడం జరిగింది. కాగా గాయత్రి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది? లేక ఏదైనా అఘాయిత్యం జరిగిందా? అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని రైల్వే శాఖ పోలీసులు తెలిపారు.

విశ్వాసనీయమైన సమాచారం మేరకు…

విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం గాయత్రి రైలు పట్టాలపై తిరుగుతూ కనిపించిందని రైల్వే సిబ్బంది ఒకరు ఆమెను రైలు పట్టాలు దిగి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అంతలోనే బాలిక రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అసలు విద్యార్థికి వచ్చిన కష్టమేమిటో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి…

అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమదు…

ఆదివారం గాయత్రి తల్లిదండ్రుల సమక్షంలో కల్వకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ లో జూనియర్ కళాశాలకు సంబంధించి, పరీక్ష రాయడానికి వెళ్లి తరువాత కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు అచ్చంపేటలో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కుమ్మరోనిపల్లి గ్రామంలో విషాదఛాయలు…

ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక గాయత్రి తెల్లవారుజామున రైలు పట్టాలపై పడి మృతి చెందడం ద్వారా ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థుల వారికి కంటతడి పెట్టించాయి. బంగారు భవిష్యత్తు ఉన్న బాలిక మృతి చెందడం ద్వారా గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News