Wednesday, January 22, 2025

సిర్పూర్(టి)లో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

సిర్పూర్(టి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) లో గురుకుల పాఠశాల విధ్యార్థిని శనివారం మృతి చెందింది. విద్యార్థిని శ్రీవాణి(14) తొమ్మిదో తరగతి చదుతోంది. విద్యార్థిని అనారోగ్యానికి గురి కావడంతో సిబ్బంది చికిత్స నిమిత్తం కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి శ్రీవాణి స్వస్థలం మంచిర్యాల జిల్లా కొటపల్లి మండలం రావులపల్లి. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. యువతి మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు బోరునా విలపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News