Friday, November 8, 2024

మొదటిసారి నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలోకి గురుకుల విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

Gurukul students admit into National University of Forensic Sciences

14 మంది గురుకుల విద్యార్థులకు సీట్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు చెందిన 14 మంది విద్యార్థులు మొట్టమొదటిసారి గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు. 14 మంది విద్యార్థులలో 10 మంది సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థల కాగా, నలుగురు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నుండి ఎంపికైనట్టు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఎంటెక్ (సైబర్ సెక్యూరిటీ) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సును అభ్యసిస్తారు. ‘ఇటీవలి సంవత్సరాలలో, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టిటిడబ్ల్యూఆర్‌ఈఐఎస్ విద్యార్థులు నైపుణ్యం కలిగిన ప్రపంచ నిపుణులుగా మారడానికి వారి ప్రయత్నంలో కొత్త మార్గాలను వెతుకుతున్నారు‘ అని గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. ఉన్నత విద్యలో ఎస్‌సి,ఎస్‌టి గురుకులాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఉన్నత స్థాయి కోచింగ్ క్యాంపులు, కెరీర్ గైడెన్స్ సెల్‌లను ఏర్పాటుచేశామని అన్నారు. అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలలో సీట్లు సాధించడంలో సహాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News