Sunday, December 22, 2024

నీట్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది నీట్ ఫలితాల్లో సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. గిరిజన గురుకులాలకు చెందిన 96 మంది విద్యార్థులు, సాంఘీక సంక్షేమ గురుకులాలకు చెందిన 233 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. గిరిజన సంక్షేమ గురుకులాల నుండి 260 మంది విద్యార్థులు నీట్‌కు హాజరు కాగా 76 మంది ఎంబిబిఎస్‌కు మార్గం సుగమం చేసుకోగా మరో 20 మంది విద్యార్థులు డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందనున్నారు. కోలవార్ కమ్యూనిటీకి చెందిన శ్రవంతి 427 మార్కులు సాధించడం గమనార్హం. కోయ కమ్యూనిటీకి చెందిన మరో నలుగురు విద్యార్థులు, గోండ్ కమ్యూనిటీకి చెందిన మరో విద్యార్థి ఈ సంవత్సరం మెడికల్ సీటు పొందారు.

సాంఘీక సంక్షేమ గురుకులాల నుండి 700 మంది విద్యార్థులకు గాను 203 మంది విద్యార్థులు ఎంబిబిఎస్‌లో సీట్లు పొందారు. మరో 30 మంది విద్యార్థులు డెంటల్ కాలేజీల్లో సీట్లు పొందారు. సొసైటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎఐఐఎమ్‌ఎస్‌లో సీట్లు పొందడం గమనార్హం. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లకు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News