హైదరాబాద్ : దేశంలోని అత్యున్నతమైన ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్డ్ 2023 ఫలితాల్లో తెలంగాణ గిరిజన, సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. గిరిజన గురుకులాలకు చెందిన 96 మంది, సాంఘీక సంక్షేమ గురుకులాలకు చెందిన 85 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రిమియర్ టెక్నాలాజికల్ యూనివర్సిటీలు ఐఐటిలలో నేరుగా సీట్లు పొందేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
తెలంగాణ గిరిజన గురుకులాలకు చెందిన 350 మంది విద్యార్థులకు ఐఐటి జెఈఈ అడ్వాన్డ్ 2023 శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరిలో 96 మంది విద్యార్థులు నేరుగా సీట్లు పొందేందుకు అర్హత సాధించగా 118 మంది ప్రిపరేటరీ ర్యాంకులు ఆశించారు. రవికుమార్ (సిఆర్‌ఎల్ ర్యాంక్ 16,711), నిత్య శ్రీ (సిఆర్‌ఎల్ ర్యాంక్ 18,287), పివిటిజి కమ్యూనిటీలకు చెందిన వారు ఉన్నారు. ఐదుగురు విద్యార్థులు ఆల్ ఇండియా క్యాటగిరిలో 10 వేల లోపు ర్యాంకు సాధించారు. దాదాపు 24 మంది విద్యార్థులు 500 లోపు కమ్యూనిటీ ర్యాంకులు సాధించారు. సాంఘీక సంక్షేమ గురుకులాలకు సంబంధించిన 450 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా వారిలో 85 మంది విద్యార్థులు నేరుగా సీట్లు పొందగా మరో 118 మంది ప్రిపరేటరీ సీట్లు పొందే అవకాశం ఉంది. ఏడు గురు విద్యార్థులు 500 లోపు కమ్యూనిటీ ర్యాంకులు సాధించారు.
టాపర్స్‌గా నిలిచిన గిరిజన గురుకుల విద్యార్థులు
క్ర.సం. విద్యార్థి పేరు ఆల్ ఇండియా ర్యాంక్ కమ్యూనిటి ర్యాంక్
1. లకావత్ సాయిచరణ్ 3373 30
2. వి. వెంకటేష్ 5833 56
3. బోడ ప్రవీణ్ 6940 63
4. బి. వేణు 8628 75
5. జె. అజయ్ 9003 77
6. ఆర్. లాలూ ప్రసాద్ 11233 97
సాంఘీక సంక్షేమ గురుకుల టాపర్స్
1. ఆర్. త్రివేణి( పిహెచ్ క్యాటగిరి) 205 83
2. బి. సాథ్విక్ 2721 53
3. సదమ్ రామకృష్ణ 2734 477
4. కుక్కల గణేష్ 9615 260
5. దోమల శివప్రసాద్ 12340 365