- Advertisement -
తెలంగాణలోని గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకులాల్లో ప్రవేశాల కోసం గత ఫిబ్రవరి నెల 23న ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. గురుకులాల్లో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఫలితాల్లో 36,334 మంది సీట్లు పొందారు. వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. సీట్ల కేటాయింపు వివరాలు ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని వివరించారు. ఫలితాల కోసం టీజీ సెట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
- Advertisement -