Thursday, January 23, 2025

అనుమానాస్పద స్థితిలో గురుకుల కళాశాల విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -
  • కళాశాల ఎదుట కుటుంబీకులు, బంధువుల ఆందోళన

మద్నూర్: మండలంలోని పెద్ద ఎక్లారా గురుకుల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మంగళవారం విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న బిచ్కుంద మండలం మానేపూర్ గ్రామానికి చెందిన వసుధ అనే విద్యార్థినీ మోనోటరీ బ్లాక్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందినట్లు కుటుంబీకులు, బంధువులు పేర్కొన్నారు. విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతికి కారణం తెలపాలంటూ నినాదాలు చేశారు.

గతంలో కూడా ఇదే గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతిచెందిన సంఘటన పాఠకులకు విధితమే. బాన్సువాడ డీఎస్పీ, బాన్సువాడ ఆర్డీవో, బిచ్కుంద సిఐ, మద్నూర్ ఎస్సైలు విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలిపే వరకు ఆందోళన విరమించేది లేదని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News