Monday, December 23, 2024

సజావుగా సాగిన గురుకుల పరీక్ష

- Advertisement -
- Advertisement -
మొదటిరోజు పరీక్షకు 86.54 శాతం అభ్యర్థులు హాజరు
ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు

హైదరాబాద్ : తెలంగాణ గురుకుల పాఠశాలలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షల్లో మొదటి రోజు సజావుగా సాగిందని, 86.54 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ట్రిబ్ )కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. మొదటి సారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో మొదటి రోజు 10,920 మందిఅభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 9,450 మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. మూడు షిఫ్ట్‌లలో హజరైన అభ్యర్థులు, ఫస్ట్ సెషన్ లో 5,032 మందికి గాను 4,368 మంది, రెండో సెషన్ లో 5,454 మంది అభ్యర్థులకు గాను 4,720 మంది. మూడో సెషన్ లో 434 మంది అభ్యర్థులకు గాను 362 మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ పరీక్ష తేదీలను తెలుసుకుని వారంరోజుల ముందుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని మల్లయ్య బట్టు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News