Monday, December 23, 2024

గురుకులాల్లో 9231 ఉద్యోగాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గురుకులాల్లో 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తొమ్మిది నోటిపికేషన్లను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు విడుదల చేసింది. డిగ్రీ కాలేజీల్లో 868 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ కాలేజీల్లో 2008 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు విడుదల చేసింది. పాఠశాలల్లో 1276 పిజిటి, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు విడుదల చేసింది. పాఠశాలల్లో పోస్టుల్లో 134 ఆర్ట్, 92 క్రాప్ట్, 124 మ్యూజిక్, 4020 టిజిటి పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12 నుంచి వన్‌టైమ్ రిజిస్టేషన్లు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్య బట్టు తెలిపారు. ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. www.trieb.telangana.com లో పూర్తి వివరాలు ఉంటాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News