Monday, December 23, 2024

గొంతు కోసుకున్న గురుకుల విద్యార్ధిని

- Advertisement -
- Advertisement -

హన్వాడ ః హన్వాడ మండలంలోని బిసి గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్దిని శుక్రవారం ఇనుప చువ్వతో గొంతు కోసుకొని తీవ్ర గాయాలకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి. బిసి గురుకులో చదువుతున్న ఓ విద్యార్ధిని ఉదయం బాత్‌రూంలోకి వెళ్లి ఇనుప చువ్వతో గొంతు కోసుకుంది. అయితే ఆమె ఎంత సేపటికి బయటికి రాక పోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది తలుపు తెరచి చూడగా ఆ విద్యార్ధిని తీవ్ర గాయాలకు గురైంది. వెంటనే ప్రాధబిక చికిత్స చేసి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ విద్యార్దిని గత కొంత కాలంగా మానసిక వ్యాదితో బాదపడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News