Monday, January 20, 2025

పూడ్చిన గురుకుల విద్యార్థిని డెడ్ బాడీని వెలికి తీసి.. శవ పరీక్ష

- Advertisement -
- Advertisement -
 టేక్మాల్: మెదక్  జిల్లా టేక్మాల్ మండల పరిధిలో పూడ్చిన విద్యార్థిని డెడ్ బాడీని వెలికితీసి శవ పరీక్ష నిర్వహించారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. తంప్లూర్ గ్రామానికి చెందిన సుప్రజ (16) గత నెల 30న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే చదువు ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు భావించారు. కానీ అదే గ్రామానికి చెందిన యువకుడి వేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోలీసులు, మండల అధికారులు వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. గతంలో  గ్రామంలో సదరు యువకుడు విద్యార్థిని పలుమార్లు వేధింపులకు పాల్పడినట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News