Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ పాలనలోనే గురుకులాల రెట్టింపు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం పురస్కరించుకొని.రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీచేశారు.డిజిటల్ తరగతి గదులను ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల సంఖ్యను మూడు రేట్లు పెంచడమే కాకుండా రాష్ట్రంలోని పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సన్నబియ్యాన్ని ఉచిత పంపిణీ చేశామని అన్నారు.

మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మొదటి విడతగా దాదాపు తొమ్మిది వేల పాఠశాలలను ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేశామని.దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఉచిత రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాలలో అందజేశారు.పాఠశాల స్థల దాత ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన సంగిశెట్టి రవికుమార్ కుటుంబ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాజాపేట ఎంపిపి గోపగాని బాలమణి యాదగిరి గౌడ్,గ్రామ సర్పంచ్ గాడి పెళ్లి శ్రవణ్ కుమార్,ప్రధానోపాధ్యాయులు గాయం బాల్ రెడ్డి,ఎస్‌ఎంసి చైర్మన్ గుర్రం సతీష్,రేణిగుంట సర్పంచ్ బూరుగు భాగ్యమ్మ నర్సిరెడ్డి,జాల సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి,రాజపేట మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి,జనరల్ సెక్రెటరీ సందిల భాస్కర్ గౌడ్,మండల యూత్ అధ్యక్షులు పల్లె సంతోష్ గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షులు రాజు,గిరిరాజు వెంకటయ్య ఎర్ర గోకుల,జస్వంత్,గుర్రం నరసింహులు,కటకం వెంకటేశం,కటకం స్వామి,నల్ల అశోక్,నరసింహారావు,మిట్ట కార్తీక్,మార్క శివ,తుంగ అక్షయ్,కటకం పృథ్వీ,గంధమల్ల అశోక్, కార్యకర్తలు నాయకులు.తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News