Thursday, January 23, 2025

భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యంత ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారీ అన్నారు. కనకదుర్గ నృత్య విభావరి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం త్యా గరాయగానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో గురు పూర్ణిమ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేణు గోపాలాచారీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో తల్లిదండ్రుల తరువాత అంతటి గౌరవ స్థానం ఒక్క గురువులకే ఉందని, వారిని గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయమన్నారు. గురువుని శిష్యులు ..ఆ శిష్యులు గురువులుగా మారిన తరువాత వారిని వారి శిష్యులు గౌరవించుకునే గురు పరంపర సంప్రదాయం అన్నారు.

అలాంటి గురు పరంపర సంప్రదాయం కొనసాగాలని సూచించారు. ఈ సందర్భంగా నాట్యగురువులు కథక్ అంజీబాబు, ఆచార్య వనజ ఉదయ్, పద్మ, కళ్యాణ్, సంగీత గురువు శ్రీవల్లి శర్మలను సత్కరించారు. ఇదేవేదికపై గురువు నిర్మల ప్రభాకర్ ను ఆమె శిష్యులు 50మందికి పైగా స త్కారం చేశారు. సాంస్కృతిక సంస్థ యువకళావాహిని స్థాపకుడు వై.కె.నాగేశ్వరరావు స్మారక పురస్కార ం…సత్యవోలు రాం బాబుకు బహూకరించారు. వంశీ సంస్థల అధినేత డా.వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన ఈకార్యక్రమంలో కుసుమ బోగరాజు, స ంస్థ నిర్వాహ కులు, నాట్యగురువు నిర్మల ప్రభాకర్ తదితరులు హాజరవగా పి.ఎం.కె గాంధీ వ్యాఖ్యానం ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News