Saturday, January 11, 2025

గురువులు జ్ఞాన దీపాలు

- Advertisement -
- Advertisement -
  • మార్గదర్శకులు అందరూ గురువులే
  • భారతీయ సంస్కృతికి గురువులే బలం

సిద్దిపేట: గురువులే జ్ఞాన దీపాలు అని చెప్పల హరినాథ శర్మ అన్నారు. సోమవారం గురుపౌర్ణమి వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాస మహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాస మహర్షి యోగా సెంటర్‌లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా యోగ సొసైటీ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెప్పల హరినాథ శర్మ హాజరై మాట్లాడుతూ వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని జౌన్నత్యాన్ని కొనియాడారు. వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ వ్యాసమే విష్ణు భగవానుడే వేద వ్యాస మహర్షి రూపంలో భూమిపై అవతరించాడని వేదాలను విభజించి పరిష్కరించి వేదాలను, మహా భారతాన్ని, మహా భాగవతాన్ని భగవద్గీతను, ఆష్టాదశ పురాణాలను ఆష్టాదశ ఉపనిషత్తులను రచించి ప్రపంచంలోనే మానవాళికి ఎంతో విలువైన వాజ్మయాన్ని సాహిత్యాన్ని అందించారని కొనియాడారు.

గురువు అంటే కేవలం తల్లి, తండ్రి ఆచార్యులే కాకుండా అతిథులు కూడా గురువులతో సమానమేనని అంతే కాకుండా మనకు మంచి విషయాన్ని సమాచారాలను దర్మాన్ని, జ్ఞానాన్ని తెలిపిన ప్రతిఒక్కరూ గురువులతో సమానమేనన్నారు. మన ప్రగతికి ఉన్నతికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరిని గురువు స్ధానంలో ఉంచి స్మరించుకోవాలన్నారు. ఇలా గురువు పరంపరలో బాగంగా వ్యాస మహర్షి పుట్టిన రోజు అయిన ఆషాడ పౌర్ణమి రోజును గురు పౌర్ణమి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యాసమహర్షి యోగా సొసైటీ కార్యవర్గానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కొండపాక, సిద్దిపేట రూరల కొమురవెల్లి, కుకునూరుపల్లి మండలాల విద్యాధికారి పురుమాండ్ల శ్రీనివాస్, వ్యాస మహర్షి సొసైటీ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా యోగసన స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట ఆశోక్‌లు మాట్లాడారు. అనంతరం యోగా అసోసియేషన్ గౌరవాద్యక్షులు కొమురవెల్లి అంజయ్య, అధ్యక్షుడు తోట ఆశోక్, చీఫ్ ప్యాట్రన్ చిప్ప ప్రభాకర్ పాల్గొని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న గురువులను సత్కరించారు. అలాగే విద్యా రంగంలో విశేష కృషి చేస్తున్న విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, సంగీతంలో శశిధర శర్మ, యూటిఎంఏ ఉద్యోగ ఉపాధ్యాయ మహిళా తరుణి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కిరెడ్డి విజయ, విద్య, యోగ రంగంలో గంగాపురం శ్రీనివాస్, డ్యాన్స్ నృత్యం విభాగంలో భవానిలను ఘనంగా సత్కరించారు. అనంతరం యోగ శిక్షకులు తోట సతీష్ సంధ్యను అసోసియేషన్ సభ్యులు, సాధకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వంద మంది అబ్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News