Wednesday, January 22, 2025

గురువారెడ్డి చిరస్మరణీయుడు

- Advertisement -
- Advertisement -
  • కమ్యూనిస్టు యోధుడిగా ఆయన పోరాటాలు మరువలేనివి
  • గురువారెడ్డి వర్ధంతిలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి

సిద్దిపేట: అలుపెరగని పోరాట యోదుడు కమ్యూనిస్టు వీరుడు ఎడ్ల గురువారెడ్డి పేద ప్రజలలో ఎప్పటికి చిరస్మకరణీయుడే అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద డిగ్రీ కళాశాలలో ఉన్న ఎడ్ల గురువారెడ్డి విగ్రహానికి మంగళవారం పూల మాలలు వేసి చాడ నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే రోజుల్లోనే గురువారెడ్డి నైజాం నిరంకుశాత్వానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించారన్నారు. కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కొనసాగిన గురువారెడ్డి భూ స్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నిర్వహించి వెట్టి చాకిరి పోవాలని సమర శీల పోరాటాలు నిర్వహించారన్నారు.

గురువారెడ్డి చురుకైన కమ్యూనిస్టు కార్యకర్తగా పేద ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. ఈయన 1952లో సిద్దిపేటలో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారని ఇక్కడ సకల సౌకర్యాలు లేకున్నా ఎడ్ల బండిపై నడుచుకుంటూ వెళ్లి అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఉచిత విద్య, వైద్యం కోసం ఎంతో కృషి చేశారన్నారు. గురువారెడ్డి తనయుడు ఎడ్ల వెంకటరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, వర్కింగ్ జర్నిలిస్టు సంఘం అద్యక్షులు రంగాచారి, సిపిఐ నాయకులు లక్ష్మన్, చంద్రం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News