Monday, December 23, 2024

పార్టీ అవకాశం ఇస్తే నా కొడుకు పోటీ చేస్తాడు: గుత్తా

- Advertisement -
- Advertisement -

న‌ల్ల‌గొండ: మంత్రి జగదీశ్ రెడ్డికి, త‌న‌కు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని రాష్ట్ర శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం న‌ల్ల‌గొండ‌లో మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల్లో నేను ఏనాడు జోక్యం చేసుకోలేదు… చేసుకోను కూడా అని అన్నారు.

అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిలో ఉంటుంద‌న్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజ‌మ‌ని అన్నారు. త‌న కుమారుడు అమిత్‌కు టికెట్ విష‌యంలో పార్టీదే తుది నిర్ణ‌య‌మ‌ని.. పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తాడని, టికెట్ కోసం పైరవీలు చేయ‌న‌ని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News