Sunday, January 19, 2025

కెసిఆర్‌పై దండయాత్ర: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ పార్టీల నేతలంతా తెలంగాణపై కన్నేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కెసిఆర్ లక్ష్యంగా కేంద్ర నాయకత్వం దండయాత్ర చేస్తుందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని గుత్తా ఆరోపించారు. తెలంగాణను చిన్నాభిన్నం చేయాలని బిజెపి ప్రయత్నిస్తుందన్నారు. కులమతాల చిచ్చులో లబ్ది పొందాలనుకోవడం మంచిది కాదని హితువు పలికారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ మభ్యపెడుతోందని హెచ్చరించారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News