Sunday, January 19, 2025

దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: నల్గొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ… దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని ఆయన అన్నారు. సెక్యులర్ శక్తుల ఏకీకరణ జరిగెల సభ జరిగిందన్నారు. ఈ దేశాన్ని లౌకిక దేశంగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు. అవగాహన లేక ఆరోపణలు చేసేటోళ్లకు సభ సరైన సమాధానం చెప్పిందని తెలిపారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రపై పోరాటం మొదలైందని ఆయన పేర్కొన్నారు. అధికార మోహం తప్ప ప్రతిపక్షాలకు వేరే ఆలోచన లేదని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్టాల్లో అమలులో ఉన్నాయా అని బీజేపీ నేతలు ప్రశ్నించుకోవాలన్నారు.

అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం దుర్నీతికి పాల్పడుతున్నదని ఆరోపించారు. కేంద్రం ది వ్యాపార దృక్పథం… దేశానికి మంచిది కాదన్నారు. నిజం పాలనలో కూడా ఎన్నో మంచి పథకాలు పెట్టారు. హైదరాబాద్ లో నిజం ఆఖరి వారసుడీ అంత్యక్రియలపై కూడా రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ఓట్లు కోసం మత రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. గురువారం గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా గౌరవం కాపాడుకోవాలి.. గవర్నర్ ఇప్పటివరకు 7 బిల్లులు ఆపారని తెలిపారు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది గవర్నర్ ఆలోచన చేయాలన్నారు. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లులను కూడా ఆపడం ఏంటి…. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని మండిపడ్దారు. రేవంత్ రెడ్డి మాటలను ఎవ్వరు పట్టించుకోవడం లేదన్న గుత్తా రేవంత్ జోకర్ ల తయారయ్యాడు వ్యాంగ్యాస్త్రాలు సందించారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News