Monday, November 18, 2024

తొమ్మిది, పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రధాని మోడీదే: గుత్తా

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ: దేశవ్యాప్తంగా 9, 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బిజెపి యేతర అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను చూసి ఓర్వలేక రాష్ట్రాలను కూల్చి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి తమ పాలనలో లేని రాష్ట్రాలను అభివృద్ధికి సంబంధించిన నిధులు మంజూరు చేయకుండా మోకాలు అడ్డుపెడుతూ, ఇబ్బందులపాలు చేస్తున్నారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 65 సంవత్సరాలుగా గత ప్రభుత్వం వరకు 58 వేల కోట్ల అప్పులు ఉండగా, బిజెపి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు కాకముందే 12 లక్షల కోట్ల అప్పులు చూపిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమాత్రం లేదని గుత్తా స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగ ప్రకారం విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఏమాత్రం కేంద్ర సహకారం లభించలేదని అన్నారు. నేడు వరంగల్‌లో నిర్వహించిన మోడీ సభలో అన్నీ సిఎం కేసిఆర్‌ను విమర్శలు చేసేందుకేనని అన్నారు. 40 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులంటూ బిజెపి చేసే అసత్య ప్రచారాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరని అన్నారు. విద్యుత్ వినియోగంలో సరఫరాలో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. సిఎం కేసిఆర్ చేస్తున్న సంస్కరణలు కారణంగా వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఇచ్చిన ప్రాధాన్యత వలన వ్యవసాయం భారం అన్న రైతన్నలు నేడు పచ్చగా కళకళలాడుతూ, దేశానికి అన్నదాతగా రూపొందిందన్నారు. మత సామరస్యంతో అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉమ్మడి పౌరహక్కు చట్టంతో అవసరమేంటో మోడీకే తెలియాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News