Monday, December 23, 2024

ప్రజాస్వామ్యం ఖూనీకి కేంద్రం కుట్రలు:గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల పేరిట దేశంలోరాజకీయ గందరగోళానికి తెర తీసిందని విమర్శించారు. నల్లగొండలో ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎన్నికల నియమావళి షెడ్యూల్ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నా జమిలి ఎన్నికల పేరిట అంతర్గత కుట్ర సాగుతుందని దుయ్యబట్టారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలే ప్రామాణికంగా బిజెపి ముందుకు పోతుందని ఆరోపించారు. సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామని,వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని కోరారు. ఆ రోజు మరోసారి అమరులను స్మరించుకుందామని సూచించారు.

రాష్ట్ర భవష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్‌ఎస్‌ని గెలిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కెసిఆర్ మంత్రివర్గంలో ద్రోహులు ఉన్నారని అంటున్న కాంగ్రెస్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఇవ్వాళ తెలంగాణ ద్రోహులు,తెలంగాణ వ్యతిరేకులు చేరారని వివరించారు . వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరుతుందని షర్మిల తెలంగాణా వ్యతిరేకి కాదా అని ప్రశ్నించారు.హైదరాబాద్ విశ్వనగరంగా రూపు దిద్దుకుందంటే కేవలం కెటిఆర్ కృషి వల్లనే అని తెలిపారు. బిజెపి,కాంగ్రెస్ పార్టీలవి పగటి కలలే అని, బిఆర్‌ఎస్ వల్లనే సుస్థిరమైన పాలన ఉంటుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News