Friday, January 24, 2025

సిఎం కెసిఆర్ కృషితోనే రాష్ట్రంలో పచ్చదనం: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే మహోన్నత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించారని, ఆయన కృషి కారణంగానే తెలంగాణలో అటవీ శాతం, గ్రీనరి శాతం ఘనంగా పెరిగిందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవలు ముగింపు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సుఖేందర్ రెడ్డిడిప్యూటీ ఛైర్మన్ బండప్రకాశ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించిందన్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదగడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, బిఆర్ఎల్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, నల్గొండ జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News