Friday, November 15, 2024

మండలి ఛైర్మన్ గా గుత్తా సఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక..

- Advertisement -
- Advertisement -

Gutha Sukender Reddy takes charge as Mandali Chairman

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి చైర్మన్ పదవికి టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం శాసనసభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదివి కోసం ఇంకెవ్వరు నామినేషన్ వేయకపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్లు మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో గుత్త సుఖేందర్ రెడ్డిని చైర్ వద్దకు రాష్ట్ర ఐటి, పురపాలక శాక మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతోపాటు మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ప‌లువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రులు ఆయనకు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా, గతంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. మండలి చైర్మన్‌గా రెండోసారి అవకాశం ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ పదవి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగా మండలిని హుందాతనంగా నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎంఎల్‌ఎ కోటా నుంచి శాసనమండలికి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంఎల్‌సిగా రెండోసారి ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్ 11వ తేదీన తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు.

Gutha Sukender Reddy takes charge as Mandali Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News