హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎఐసిసి ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో అమిత్ కాంగ్రెస్‌లో చేరారు. ఎఐసిసి కార్యదర్శ రోహిత్ చౌదరి, డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో తన అమిత్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. బిఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం గత కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. నల్లగొండలో గుత్తా సుఖేందర్- జగదీశ్ రెడ్డి మధ్య కోల్డ్ వారు నడుస్తోందని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్ గూటికి వెళుతుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో అది నిజమైంది.
కాంగ్రెస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -