Sunday, January 19, 2025

మండలి చైర్మన్‌గా గుత్తా

- Advertisement -
- Advertisement -

Gutta as Chairman of the Legislature

నేడు నామినేషన్ దాఖలు, ఎన్నిక లాంఛనమే, సోమవారం నాడు ప్రకటన

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయనకు సిఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు చైర్మన్ పదవికి కోసం గుత్తా దరఖాస్తు చేయనున్నారు. ఇక విపక్షాల నుంచి మరెవ్వరు పోటీలో ఉండే అవకాశం లేని కారణంగా గుత్తా ఎన్నిక లాంఛనం కానుంది. ఈ నేపథ్యంలో గుత్తా ఎన్నికను అధికారికంగా సోమవారం ప్రకటించనున్నారు. అదే రోజున ఆయన మండలి చైర్మన్‌గా తన పదవి బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈనెల 14న ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను వేసేందుకు అవకాశం కల్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News