నల్లగొండ: కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫెడరల్ వ్యవస్థకు కేంద్రం విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. బాధ్యత లేకుండా విలీనం, విమోచనం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియని వాళ్లు ఉన్నారని గుత్తా ఎద్దేవా చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. గవర్నర్ తమిళి సై కూడా విమోచన దినం అని అనడం సరికాదని దుయ్యబట్టారు. గవర్నర్ వ్యవస్థకు ఉండే గౌరవాన్ని పోగొట్టుకోవద్దని గుత్తా సూచించారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.