Wednesday, January 22, 2025

ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలి

- Advertisement -
- Advertisement -

Gutta Jwala couple participated in Green India Challenge

 

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల దంపతులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని జిహెచ్‌ఎంసి పార్కులో ఆదివారం మొక్కలు నాటారు. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, సినీ నటుడు విష్ణు విశాల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జిహెచ్‌ఎంసి పార్కులో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్, గుత్తాజ్వాలలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి అభినందనలు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపి జోగినపల్లి సంతోష్‌కమార్‌కి ఇరువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్‌కి విష్ణువిశాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. కార్యక్రమం అనంతరం విష్ణు విశాల్, గుత్తాజ్వాలకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News